Trending Now

కేసీఆర్‌పై బురద జల్లెందుకే కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది..

సిద్దిపేట ఆర్డిఓ కార్యాలయం ఎదుట రైతు దీక్షలో..

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 06: కేసీఆర్ పై బురద జల్లెందుకే కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన రైతు హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. సిద్దిపేట ఆర్డిఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన బీఆర్ఎస్ రైతు దీక్ష లో వారు పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన రైతుబంధు, వడ్లకు 500 రూపాయల బోనస్, రెండు లక్షల రుణమాఫి చేయాలని పంటలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబతారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. కుంటీ సాకులు చెప్తూ ప్రాజెక్ట్ లో నీరు వదిలి పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ సమయంలోనే పథకాల అమలులో విఫలం అయిందన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో తొమ్మిది నెలల కాలంలో విద్యుత్ వ్యవస్థలో పెను మార్పులు తెచ్చి నిరంతర విద్యుత్ సరఫరా చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వంద రోజులలోనే విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిందని ఆయన ఆరోపించారు. నాడు కరెంట్ పోతే వార్త అని నేడు కరెంట్ ఉంటే వార్త అన్నారు. ప్రభుత్వం కు చిత్త శుద్ది లేకనే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చిన్న సమస్యను కాంగ్రెస్ పెద్దదిగా చేస్తోందన్నారు. రాజకీయమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని వాఖ్యనించారు.

Spread the love

Related News

Latest News