Trending Now

తొలి దశ పోలింగ్ ప్రారంభం..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: నేడు సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం అయింది. ఈరోజు 21 రాష్ట్రాలలో పోలింగ్ జరుగుతుంది. ఇందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేశారు. పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా అలంకరించారు. మొత్తం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 102 లోక్‌సభ నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 16.63 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఏ రాష్ట్రంలో ఎన్ని స్థానాలు..?

తొలి దశలో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అస్సాం, మహారాష్ట్రల్లో 5, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, ఉత్తరాఖండ్‌లోని 5, అరుణాచల్‌ప్రదేశ్‌లోని 2, మేఘాలయలో 2, అండమాన్ నికోబార్‌లో 1, మిజోరాంలో 1, పుదుచ్చేరిలో 1, సిక్కింలో1, లక్షద్వీప్‌లోని 1 సీటు, మణిపూర్‌లో 3, జమ్మూ-కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, త్రిపురలో ఒక్కో సీటుకి పోలింగ్ జరుగుతుంది.

Spread the love

Related News