ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ‘పవర్ స్టార్’ పేరిట మార్కెట్‌లో మద్యం ఉందంటూ వైసీపీ చేసిన విమర్శలకు జనసేన కౌంటర్ ఇచ్చింది. ‘అది తెచ్చింది మీరేనని మర్చిపోయారా? నిజమే, పవర్ స్టార్ ఓ బ్రాండ్. కల్తీ మద్యానికి కాదు, మానవత్వానికి. అవినీతికి కాదు, అభివృద్ధికి. సంక్షోభానికి కాదు, సంక్షేమానికి. మీరు సృష్టించిన సంక్షోభం నుంచి AP ప్రజలు త్వరలోనే విముక్తి పొందుతారు. మీరు శాశ్వతంగా బెంగళూరు ప్యాలెస్‌లో రెస్ట్ తీసుకోవచ్చు’ అని పేర్కొంది.
ఏపీలో ‘పవర్ స్టార్’ విస్కీ.. వైసీపీ, కూటమి మధ్య వార్
కూటమి ప్రభుత్వం పవర్ స్టార్ విస్కీ పేరుతో కొత్త బ్రాండ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని వైసీపీ విమర్శించింది. నాణ్యమైన మద్యం అంటూ జన సైనికులను మెప్పించేలా ఈ బ్రాండ్‌ను తెచ్చిందని ఆరోపించింది. దీనికి టీడీపీ-జనసేన కౌంటర్ ఇస్తున్నాయి. ఐదేళ్లలో ప్రమాదకరమైన మద్యంతో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను జగన్ తీశారని దుయ్యబట్టాయి. ఈ బ్రాండ్‌లు అన్నీ వైసీపీ తెచ్చినవే అని పేర్కొంటున్నాయి.