Tirumala: పండగ పూట విషాదం.. తిరుమలలో గుండెపోటుతో భక్తురాలి మృతి

Heart Attack in Tirumala: వినాయక చవితి పండుగ పూట విషాదం నెలకొంది. తిరుమలలో ఓ భక్తురాలు గుండెపోటుతో మృతిచెందింది. శనివారం తెల్లవారుజామున సుమారు 3.30 నిమిషాల సమయంలో శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో నిల్చున్న భక్తురాలు ఝాన్సీ(32) గుండెపోటుతో కుప్పకూలింది. వెంటనే తోటి భక్తులు, నర్సులు సీపీఆర్ చేసి అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయింది.

కడపకు చెందిన ఝాన్సీ..లండన్ లో స్థిరపడ్డారు. ఆమెకు కవల పిల్లలున్నారు. కాాగా, అంబులెన్స్ గంట ఆలస్యంగా రావడంతోనే తన కూతురు చనిపోయిందని మృతురాలి తండ్రి బోరున విలపించాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, రెండు మెట్ల మార్గాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో డాక్టర్ తో కూడిన అత్యవసర వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Related News

Latest News