Trending Now

అమిత్ షా నివాసానికి చేరుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీకి సంబంధించిన కీలక రాజకీయ పరిణామాలకు ఢిల్లీలోని కేంద్రమంత్రి అమిత్ షా నివాసం వేదికగా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ హస్తినలో అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. అమిత్ షాతో వారిరువురు సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంతో ఏపీలో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Spread the love

Related News

Latest News