ప్రతిపక్షం, జూలై 16: అమెరికాలో మతపరమైన ద్వేషంతో భారతీయుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. వెస్ట్ వ్యాలీ సిటీలోని ఓ మాల్‌లో భారతీయుడు సోహైల్‌పై లార్సెన్ అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ముందుగా సోహైల్‌ను నిందితుడు అతడి మతం గురించి ప్రశ్నించినట్లు సమాచారం. ‘నువ్వు ముస్లిమేనా?’ అని అడగగా.. సోహైల్ అవునని సమాధానం చెప్పిన తర్వాత లార్సెన్ అతడిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో సోహైల్‌పై సుమారు 15 సార్లు కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది.
ఘటన అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. తాను ముస్లిం కావడం వల్లే సోహైల్‌పై దాడి చేసినట్లు లార్సెన్ చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ముస్లింలందరినీ చంపేస్తానంటూ అతడు తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
తీవ్రంగా గాయపడిన సోహైల్‌ను ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వెనుక మతపరమైన ద్వేషమే కారణమా? అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు.


















