ప్రతిపక్షం, జూలై 15: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విప్‌లుగా ఉన్న ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్‌కు రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వారికి మంత్రి హోదాకు సంబంధించిన ప్రోటోకాల్ అమలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయానికి సంబంధించిన జీవోను ఏప్రిల్‌లో అప్పటి ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేరిట సిద్ధం చేయగా, తాజాగా అధికారికంగా విడుదల చేశారు. పార్టీ కోసం తొలి నుంచి పనిచేసిన ఇద్దరు నేతలకు తగిన గుర్తింపు లభించిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

















