ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో ఫలితాలను విద్యాశాఖ సెక్రటరీ రిలీజ్ చేయనున్నారు. ప్రథమ, ద్వితీయ ఏడాది పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు ఒకేసారి వెల్లడించనుంది. మార్కుల నమోదులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. తెలంగాణ ఇంటర్ పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 4,78,527 మంది ఫస్టియర్ విద్యార్థులు, 4,43,993 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాశారు.