ప్రతిపక్షం, జూన్ 06: హైదరాబాద్లో కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వస్తున్న 10 ఎకరాల శిఖం భూమిని వెంటనే ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.
మీడియాతో మాట్లాడిన ఆమె, తెలంగాణ ప్రజల భావోద్వేగాలు, కళాకారుల కృషిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దన్నారు. తెలంగాణలో సినిమాలకు లభించే ఆదరణ, ఇక్కడి ప్రేక్షకుల మద్దతుతోనే సినీ పరిశ్రమ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల సహకారంతో సంపాదించిన ఆదాయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తూ, రాష్ట్ర ప్రజల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
అదే సమయంలో రాష్ట్రంలోని విలువైన భూముల వ్యవహారంపై కూడా స్పందించిన కవిత, ప్రభుత్వ భూముల కేటాయింపుల విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం అవసరమైతే న్యాయపరమైన పోరాటం కూడా చేస్తామని హెచ్చరించారు.















