హైదరాబాద్‌లో కులవృత్తుల మేళాకు విశేష స్పందన: మంత్రి పొన్నం

ప్రతిపక్షం, జూలై 19: ఆషాఢ బోనాల సందర్భంగా హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కులవృత్తుల మేళాకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

ఆదివారం ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి మేళాను సందర్శించాలని మంత్రి కోరారు. బీసీ కళాకారులు, చేతివృత్తిదారులు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కళాకారులు, చేతివృత్తిదారులకు మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటు వారి ప్రతిభను ప్రజలకు పరిచయం చేయడమే మేళా ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. ప్రజల ఆదరణతో మేళా విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News