ప్రతిపక్షం, జూలై 18: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కష్టపడి చదివితే విజయం సాధించవచ్చని బిహార్‌కు చెందిన ముగ్గురు అన్నాచెల్లెళ్లు నిరూపించారు. సహర్సా జిల్లాకు చెందిన రజ్నీశ్, ప్రహ్లాద్, సాక్షి ముగ్గురూ నీట్లో మంచి ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు.
వారి తండ్రి చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఖరీదైన కోచింగ్ ఇప్పించే స్థోమత లేకపోవడంతో ముగ్గురు విద్యార్థులు సాధారణ కోచింగ్‌తోనే తమ చదువును కొనసాగించారు. ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకున్న వారు పట్టుదలతో చదివి నీట్లో ర్యాంకులు సాధించారు.
ముగ్గురూ కలిసి చదువుకోవడం, కఠినమైన అంశాలపై పరస్పరం చర్చించుకోవడం తమ విజయానికి ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ఆర్థిక పరిస్థితులు లక్ష్య సాధనకు అడ్డంకి కాదని తమ విజయం ద్వారా నిరూపించారు.

















