Trending Now

‘నేనెవరికి తలొంచే వాడిని కాను’.. యాదాద్రి ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి క్లారిటీ

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: యాదాద్రి దేవాలయంలో సోమవారం జరిగిన ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు క్లారిటీ ఇచ్చేశారు. మంగళవారం హైదరాబాదులో సింగరేణి అతిథి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో యాదాద్రి ఘటనపై ఆయన స్పందిస్తూ డిప్యూటీ సీఎం గా రాష్ట్రాన్నిశాసిస్తున్నానన్నారు. నేనెవరికో తల వంచే వాడిని కాదు..ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాడిని అంతకంటే కాదు.. ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు.. నేను కావాలనే యాదాద్రి దేవాలయంలో వేద పండితుల ఆశీర్వచన సమయంలో చిన్న పీట మీద కూర్చున్నాను అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ ఫోటోతో కావాలనే ట్రోల్ చేస్తున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

సింగరేణిలో కారుణ్య నియామకాలు చేస్తాం..

సింగరేణి కాలరీస్ కి సంబంధించి హైదరాబాద్ నగరంలో గెస్ట్ హౌజ్ కి భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని భట్టి తెలిపారు. సింగరేణి తెలంగాణ లోనే కాకుండా దేశంలో విద్యుత్ కోసం బొగ్గు అందిస్తున్న సంస్థ కావడం మన రాష్ట్రానికి గర్వకారణం.. సుమారు 45 వేల ఉద్యోగులు సింగరేణి లో పని చేస్తున్నారు.. రాష్ట్ర అవసరాలకు ఇతర అవసరాలకు బొగ్గు ను సరఫరా చేస్తూ.. ఇంకా పది కాలాల పాటు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పాదయాత్ర లో బాగంగా కొన్ని వేల మందిని కలిశాను.. తాడిత, పీడిత అనేక వర్గాల వారిని కలిశాను. మాకు 10 సంవత్సరాలుగా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నాం.. డబుల్ బెడ్రూమ్ అని ఆశపెట్టి పాలకులు మోసం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని మోసం చేసి ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇవ్వలేదని ఆవేదన చెందారు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చి మాకు ఇల్లు ఇవ్వండని ప్రతి పేద కుటుంబం కోరింది. ఇల్లు కట్టుకున్న వారికి రెగ్యులర్ చేస్తామని పాదయాత్రలో చెప్పాము.. సింగరేణి కాలరీస్ ప్రకారం జీఓ 76 ప్రకారం రెగ్యులరైజ్ చేస్తామని తెలిపారు. మిగిలిన వారికి కూడా ఇచ్చిన మాట ప్రకారం రెగ్యులరైజ్ చేస్తాం.. ప్రజలతో మమేకమై వారి అవేదనను నెరవేర్చాలనే సంకల్పంతో రాష్ట్ర కాంగ్రెస్ సమిష్టిగా పని చేసి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చామన్నారు.

పాదయాత్ర లో భాగంగా యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామీ గుట్ట పైకి వెళ్లాను ఆరోజు మనస్ఫూర్తిగా యాదగిరి లక్ష్మీనరసింహుడిని కోరుకున్న.. ఇల్లు లేని పేదలు, నిరుద్యోగ యువకుల బాధలు తీరాలంటే ఇందిరమ్మ రాజ్యం రావడానికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకున్న.. లక్ష్మీ నరసింహుడి ఆశీర్వాదాలతో నిన్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత హైదరాబాద్ రాకుండా మీ నియోజకవర్గాల్లో బెస్ట్ లెక్చర్ అనుభవజ్ఞులతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా ఆన్ లైన్పాఠాలు చెప్పిస్తం.. వడ్డీలేని రుణాలు ఇవ్వడానికి హైదరాబాద్ లో భారీ సభ ఏర్పాటు చేశాం.. గతంలో ఉన్న వడ్డీలు కూడా మాఫీ చేస్తూ చెక్కు అందిస్తాం.. ఈ ప్రభుత్వం అనవసరంగా దుబారా ఖర్చులు చేయదన్నారు. సింగరేణి స్థానికత పై ఉమ్మడి జిల్లాలు చూడాలనే చెబుతున్నారు.. దానిని పరిశీలిస్తున్నామని భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్​బాబు, పొన్నం ప్రభాకర్​, జీహెచ్​ఎంసీ మేయర్​ గద్వాల విజయలక్ష్మి తో పాటు ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, గడ్డం వివేక్ సింగరేణి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love