Trending Now

రామ్ చరణ్ బర్త్ డే సర్ ప్రైజ్ లు రెడీ..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు.. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో చేస్తుండగా.. దాదాపు ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇక ఇప్పుడు ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఇదిలా ఉండగా.. మే 27 న రామ్ చరణ్ పుట్టినరోజు రాబోతుంది. ఈ ఏడాది గ్రాండ్ గా పుట్టినరోజు వేడుకలను చేసేందుకు మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు రామ్ చరణ్ నటిస్తున్న మూవీల నుంచి బర్త్ డే సర్ ప్రైజ్ లను టీమ్ రెడీ చేస్తుంది. ఈక్రమంలోనే అదిరిపోయే అప్ డేట్ ని రెడీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి సాంగ్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి పెద్దగా అప్ డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఈ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేసిన RC16 మూవీ నుంచి టైటిల్ అనౌన్స్‌మెంట్ రాబోతుందట. ఈ చిత్రానికి ‘పెద్ది’, ‘కలియుగ భీమా’ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నారు. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాను అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News