Trending Now

మాజీ మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ..

ప్రతిపక్షం, తెలంగాణ: మాజీ మంత్రి కేటీఆర్‌కు హైదరాబాద్‌లో నిరసన సెగ తగిలింది. మంగళవారం అంబర్ పేట్‌లో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. కేటీఆర్ ‘గో బ్యాక్’ అంటూ ఫ్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత పదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఊసెత్తని బీఆర్ఎస్ సర్కార్.. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఓర్వలేక పిచ్చి కూతలు కూస్తున్న కేటీఆర్ ఖబడ్దార్.. నిన్ను ఊర్లలో తిరగనివ్వమని హెచ్చరించారు.

Spread the love