Trending Now

యువకుని హత్య కేసును ఛేదించిన పోలీసులు..

ఘటన వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, 11: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎన్నికల వేళ సంచలనం సృష్టించిన యువకుని హత్య కేసును నిర్మల్ జిల్లా పోలీసులు 12 గంటలలోపే ఛేదించారు. నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ ట్యాంక్బండ్ వద్ద శుక్రవారం రాత్రి 8:30 గంటలకు ముగ్గురు యువకుల మధ్య జరిగిన చిన్నపాటి తోపులాట హత్యకు కారణం అయింది. ఎందుకు ప్రధాన కారణంగా ప్రేమ వ్యవహారమే అయి ఉంటుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేసిన అది వాస్తవం అని తేలింది. శనివారం మధ్యాహ్నం నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల హత్యకు గల కారణాల ను వివరించారు. పట్టణానికి చెందిన అబ్దుల్ జీషన్ను గాజులపేట కు చెందిన మహమ్మద్ సుమేర్ తాను ప్రేమిస్తున్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడని కత్తితో దాడి చేసి చంపానని ఒప్పుకున్నట్లు చెప్పారు.

ఇదే విషయమై మాట్లాడుకుందామని శుక్రవారం రాత్రి ఎన్టీఆర్ మినీ ట్యాంక్ బండ్ వద్దకు రమ్మన్న సుమారు అబ్దుల్ జీషన్ ఇతర మిత్రులతో కాసేపు మాట్లాడి.. జీషాన్ తో ఒకరితోనే మాట్లాడాలని మీరు పక్కకు వెళ్లిన అంటూ ఆ ఇద్దరు మిత్రులను సూచించడంతో వారు కొద్దిపాటి దూరంలో వెళ్ళగానే జీవన్ పై తాను తెచ్చుకున్న కత్తితో సుమేర్ నిర్ధాక్షణ్యంగా దాడి చేసి తీవ్ర గాయాలపాలుజేశాడు. గమనించిన ఇరువురు మిత్రులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆ కత్తితో సుమేర్ మతిన్ అనే యువకునిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అప్పటికే పరిసరాలలో ఉన్న వారు పరిస్థితిని గమనించి వెంటనే ఇరువురిని నిర్మల్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించగా అప్పటికే జీషాన్ మృతి చెందినట్లు వైద్యాధికారులు నిర్ధారించినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల వివరించారు.

నిందితుడు సుమారును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకోవడం జరిగిందని రిమాండ్ కూడా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. క్షిణికావేశంలో యువకులు ఇతర నిర్ణయాలు తీసుకొని ఒకరిపై ఒకరు మరణాయుధాలతో దాడులు చేసుకొని చంపకొవద్దని సూచించారు. ఎంత మానసిక శోభకు గురైన ఓపికతో సహనంతో తగిన నిర్ణయాలు తీసుకొని అవసరమైతే చట్టాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని కోరారు. చట్ట ఆధారిత నిర్ణయాలే ఇలాంటి ఘటనలకు కారణం కాకుండా చేస్తూ, భవిష్యత్తు భద్రతను కల్పిస్తాయని ఆమె ఈ సందర్భంగా వివరించారు. తప్పు చేసిన వారు ఎలాంటి వారైనా వారికి చట్టాల ఆధారంగా కఠినమైన శిక్షలు ఉంటాయని, ఈ లాంటి విషయాల పట్ల ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, పట్టణ సీఐ అనిల్ కుమార్ లతోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Related News