‘ఆమెతో ఏడాదిగా రిలేషన్‌లో ఉన్నా.. వీడియో ఆధారాలున్నాయి’.. ఉదయ్ సూసైడ్‌ నోట్‌లో సంచలన వ్యాఖ్యలు

ప్రతిపక్షం, జూలై 20: లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆత్మహత్యకు యత్నించిన ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి రాసినట్లు చెబుతున్న సూసైడ్‌ నోట్‌ వెలుగులోకి వచ్చింది. తనపై ఆరోపణలు చేసిన మహిళా ట్రైనీతో ఏడాది పాటు సంబంధం ఉన్నట్లు అందులో పేర్కొన్నట్లు సమాచారం. ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత కూడా తమ సంబంధం కొనసాగిందని, ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఉదయ్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

తన ఆత్మహత్యకు నలుగురు కారణమని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ లేఖలోని అంశాలపై పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News