•జిల్లాలో చోరికి గురైన రూ.65 లక్షల విలువ గల 236 ఫోన్లు బాధితులకు అప్పగింత
•ఫోన్ల రికవరీతో బాధితుల ముఖాల్లో చిరునవ్వులు
•జిల్లాలో ఇప్పటివరకు 500 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగించిన వనపర్తి పోలీసులు
•జిల్లా ఎస్పీ.సునీత రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన బాధితులు
ప్రతిపక్షం, జులై 24,వనపర్తి ప్రతినిధి: ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 65లక్షల విలువ గల 236 చోరీ అయిన ఫోన్లను వనపర్తి జిల్లా పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.పేద, మధ్యతరగతి బాధితులు పోగొట్టుకున్న, చోరికి గురైన ఫోన్లను రికవరీ కోసం వనపర్తి జిల్లా ఎస్పీ. సునీత రెడ్డి ప్రత్యేక చొరవతో వనపర్తి, ఆత్మకూర్, కొత్తకోట సర్కిళ్ల నుంచి 10మంది అధికారులతో 3బృందాలుగా ఏర్పడి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి సీఈఐఆర్ వ్యవస్థ ద్వారా పోయిన, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను తెలంగాణ -196 (ఫోన్లు), ఆంధ్రప్రదేశ్ -15, కర్ణాటక- 08 , కేరళ-02 , మధ్యప్రదేశ్-06, మహారాష్ట్ర – 09 , రాష్ట్రాల నుండి ఈ మొబైల్స్ ను రికవరీ చేశారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 500 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.పోగొట్టుకున్న,చోరికి గురైన ఫోన్లు పోలీసులు తిరికి అప్పగించడంతో బాధితుల ముఖాల్లో చిరునవ్వుతో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.శుక్రవారం ఎస్పీ కార్యాలయ సమావేశ భవనంలో మొబైల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి బాధితులకు ఎస్పీ.సునీత రెడ్డి ఫోన్లు అందజేశారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ. సునీత రెడ్డి మాట్లాడుతూ…సాధారణంగా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న, చోరికి గురైన తిరిగి వాటిని పొండటానికి బాధితులు వెంటనే https://www.ceir.gov.in అనే వెబ్సైట్ లో లేదా దగ్గర్లో ఉన్న పోలీస్టేషన్లో సంప్రదించాలని ఎస్పీ తెలియజేశారు.ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్లను తిరిగి రాబట్టి బాధితులకు అందజేయడం జరుగుతుందని ఎస్పీ హామీ ఇచ్చారు. బాధితులు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని ఫిర్యాదుకు ఎలాంటి మీసేవ సెంటర్లలో చలాన్లు కట్టవలసిన అవసరం లేదని తెలిపారు.
రికవరీ బృందానికి ఎస్పీ ప్రశంసలు,నగదు బహుమతి
ఈ చోరీ మొబైల్స్ రికవరీలో ప్రతిభ చూపిన సిసిఎస్ సీఐ.పవార్ అశోక్ కుమార్, ఎస్సై.రామరాజు, ఏఎస్సై. తిరుపతిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ ఎన్.రాజగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణయ్య, బాలయ్య, రాఘవేందర్, కానిస్టేబుల్స్ స్వామి,మురళి కృష్ణ,సమరసింహారెడ్డి, మురళి, సత్యనారాయణ, భూపాల్ లను ఎస్పీ.సునీత రెడ్డి నగదు బహుమతి అందజేసి ప్రత్యేకంగా అబినధించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ.గిరిబాబు, వనపర్తి డిసిఆర్భీ డిఎస్పీ.బాలాజీ నాయక్, సిసిఎస్ సీఐ. పవార్ అశోక్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ. నరేష్, వనపర్తి సీఐ.సుగంధర రత్నం, కొత్తకోట సీఐ. రాంబాబు, ఆత్మకూరు సీఐ. శివకుమార్, వనపర్తి సిసిఎస్ ఏఎస్సై.తిరుపతి రెడ్డి, ప్రత్యేక బృందం పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



















