ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీలో అత్యధికంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో 90.91% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో 63.32% పోలింగ్ రికార్డు అయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఎంపీ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06%, అత్యల్పంగా విశాఖలో 71.11% పోలింగ్ నమోదు అయింది.
ఏపీలో పోలింగ్ శాతంపై అధికారిక ప్రకటన
AP సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి 80.66% పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ట్వీట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.07%ను కలిపితే మొత్తం పోలింగ్ 81.73%గా ఉండొచ్చని ప్రాథమిక అంచనా. పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని 2014లో 78.90%, 2019లో 79.80% మేర పోలింగ్ నమోదైంది.