ప్రతిపక్షం, జూలై 04: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘లెనిన్’ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.
ఈ నేపథ్యంలో అఖిల్ కోసం స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారంలో భాగమవనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అఖిల్‌తో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు సమాచారం.
అక్కినేని కుటుంబంతో జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆయన ఈ ప్రమోషన్‌కు అంగీకరించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా, ‘లెనిన్’ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

















