ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ అక్టోబర్ 30: జిల్లావ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 31న మెదక్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు మెదక్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొండల్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు.ఎల్నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాల జాబితాలో మెదక్ జిల్లాలో కేవలం మనోహరాబాద్ మండలానికే చోటు కల్పించడం అన్యాయమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కరువు పరిస్థితులు ఉన్నందున అన్ని మండలాల్లో క్షేత్రస్థాయిలో కరువు అంచనా వేసి రైతులకు న్యాయం చేయాలని, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశం మెదక్ సిటిజన్ ఫోరం, మరియు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (143 ).తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ–IJU), రైతు స్వరాజ్య వేదిక, మెదక్ స్టడీ సర్కిల్ సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి.ఈ సమావేశానికి ప్రజాసంఘాలు, రైతు సంఘాలు, మేధావులు, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు హాజరై తమ విలువైన సూచనలు, సలహాలు అందించాలని ఆయన కోరారు.





























