తెలంగాణ రక్షణ సేనలో తొలి కీలక నియామకాలు.. 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీల ప్రకటన

ప్రతిపక్షం, జూలై 15: తెలంగాణ రక్షణ సేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తొలి విడతలో 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తనకు అదృష్ట సంఖ్యగా భావించే నంబర్ 5 వచ్చేలా అనుగుణంగా మొత్తం 23 మంది ఇన్‌చార్జీలను ప్రకటించినట్లు సమాచారం. ఆషాఢ మాసంలో శుభ ముహూర్తాన్ని పురస్కరించుకుని ఈ నియామకాలను అధికారికంగా ప్రకటించినట్లు పార్టీ తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విస్తరణకు ఈ నియామకాలు కీలకంగా మారనున్నాయని, ప్రతి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, కార్యాచరణను సమన్వయం చేసే బాధ్యతలను ఇన్‌చార్జీలకు అప్పగించనున్నట్లు పేర్కొంది.

అలాగే, మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా దశలవారీగా ఇన్‌చార్జీలను నియమించనున్నట్లు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా బలమైన సంస్థాగత నిర్మాణంతో ప్రజల్లోకి వెళ్లడమే తెలంగాణ రక్షణ సేన తదుపరి కార్యాచరణగా పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది.

Spread the love

Related News

Latest News