ప్రతిపక్షం, వెబ్ డెస్క్: కాజీపేట్ రైల్వేస్టేషన్ యార్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రిపేర్ కోసం నిలిపిన రైల్ బోగీ నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే మంటలు అదుపు చేశారు. ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై విచారణ చేస్తున్నమని పోలీసులు తెలిపారు.