Trending Now

16న శివకార్తికేయన్ మూవీ టైటిల్ టీజర్‌

శివకార్తికేయన్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ఎస్​ కే21 టైటిల్ టీజర్‌ ఫిబ్రవరి 16న విడుదల.స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా ఉలగనాయగన్ కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ , సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివకార్తికేయన్‌ కు జోడిగా సాయి పల్లవి నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ కి సంబధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫిబ్రవరి 16న ఎస్​ కే 21 టైటిల్ టీజర్‌ ని లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఒక స్టన్నింగ్ వీడియో ని షేర్ చేశారు. ఈ వీడియో శివకార్తికేయన్ జిమ్ లో ఇంటెన్స్ వర్క్ ఔట్స్ చేస్తూ కనిపించారు. అలాగే డిఫరెంట్ గన్స్ ని ఫైర్ చేస్తూ కనిపించడం క్యురియాసిటీ పెంచింది.ఈ మూవీలో శివకార్తికేయన్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా బిగ్ స్క్రీన్ పై ప్రజంట్ చేయనున్నారు. ‘గట్స్ అండ్ గోర్’ దేశభక్తి కథాంశంతో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ జి వి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నారు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్. సినిమాటోగ్రాఫర్ గా సిహెచ్ సాయి, ఎడిటర్ గా ఆర్. కలైవానన్, యాక్షన్ డైరెక్టర్ గా స్టీఫన్ రిక్టర్ పని చేస్తున్నారు.

Spread the love