Trending Now

తెలంగాణ పీజీఈసెట్‌ –2024 నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్ బ్యూరో: 2024-25 విద్యా సంవత్సరానికి గానూ వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)-2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్‌) నిర్వహించనుంది.. పీజీఈసెట్‌ 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కాలేజీల్లో ఫుల్‌ టైం ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 16 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు, పరీక్ష తేదీలు, కోర్సుల వివరాలు వంటి సమాచారం కింద చెక్‌ చేసుకోవచ్చు.

Spread the love

Related News

Latest News