శిక్షణ పొందిన మహిళలకు మోడీ కానుకగా ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ

ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, జూలై 03: కరీంనగర్ ఎల్.యం.డి కాలనీలోని ‘దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం’ ఆధ్వర్యంలో మహిళల సాధికారత మరియు స్వయం ఉపాధి కల్పన కోసం ఒక బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కేంద్రంలో ఇటీవల టైలరింగ్ మరియు జూట్ (జనపనార వస్తువుల తయారీ) శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని ఉత్తీర్ణత సాధించిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేయడం జరిగింది.ఈ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులైన మహిళలకు కుట్టు మిషన్లను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ గారితో పాటు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు, సంబంధిత అధికారులు మరియు శిక్షణ పొందిన మహిళలు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి, స్వయం ఉపాధి పొందడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడనుంది.

Spread the love

Related News

Latest News