Trending Now

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కలిపించిన హుస్నాబాద్ సీఐ ఎర్రోల్ల కిరణ్

ప్రతిపక్షం, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని సీవీ రామన్ పాఠశాలలో విద్యార్థుల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి గుడ్ టచ్ బాడ్ టచ్, తదితర అంశాలపై హుస్నాబాద్ సీఐ ఎర్రోల్ల కిరణ్ హుస్నాబాద్ షీటీమ్ బృందం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ.. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా బాలికల, మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి జరుగుతున్న సైబర్ నేరాల గురించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. భరోసా సెంటర్లో ఫోక్సో కేసులలో 18 సంవత్సరాలు లోపు ఉన్న బాలికలకు అందిస్తున్నసేవల గురించి షీ టీమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి, మానవ అక్రమ రవాణా ఫోక్సో చట్టాల గురించి మహిళలు గృహహింసకు వరకట్నం గురించి శారీరకంగా మానసికంగా హింసించే తదితర అంశాల గురించి స్నేహిత మహిళా సెంటర్లో నిర్వహించే కౌన్సిలింగ్ గురించి వివరించారు.

ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్ 100, సిద్దిపేట షిటీమ్ వాట్సప్ నెంబర్ 8712667434, మహిళా పోలీస్ స్టేషన్ సిద్దిపేట 8712667435 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని విధ్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణరెడ్డి, అధ్యాపకులు హుస్నాబాద్ డివిజన్ షీటీమ్ బృందం సైదయ్య, హెడ్ కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుళ్లు స్వప్న, ప్రశాంతి, కానిస్టేబుళ్లు కృష్ణ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love