ప్రతిపక్షం, వెబ్ డెస్క్: టెస్టు క్రికెట్ రిటైర్మెంట్‌ను శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా వెనక్కి తీసుకున్నాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు సూచన మేరకు అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అంతేకాదు బంగ్లాదేశ్‌తో త్వరలో జరగనున్న టెస్టు సిరీస్ కోసం శ్రీలంక ప్రకటించిన జట్టులో హసరంగాకు చోటు దక్కింది. సోమవారం బంగ్లా సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది.
పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి సారించేందుకు గతేడాది ఆగస్టులో వనిందు హసరంగా టెస్టు క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. బోర్డు సూచన మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్న హసరంగా.. మళ్లీ రెడ్‌బాల్ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు. లంక తరఫున హసరంగా 4 టెస్టులు ఆడాడు. 54 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. హసరంగా ఆల్‌రౌండర్ అన్న విషయం తెలిసిందే. స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేస్తాడు.