Trending Now

Breaking News: కాంగ్రెస్ లోకి అల్లోల చేరడం ఖాయం..!

నేడో.. రేపో బీఆర్ఎస్ ను వీడనున్న అల్లోల వర్గీయులు..

ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి: రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ముమ్మాటికి ఖాయమైనట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులతో కాంగ్రెస్లో చేరిక విషయమై అల్లుళ్ల ఇంద్రకరణ్ రెడ్డి పలు దఫాలు తనదైన రీతిలో చర్చలు జరుపగా.. ఆయనకు కాంగ్రెస్ అగ్రస్థాయి నాయకులు స్థానిక కాంగ్రెస్ ఆయా విభాగాల పదాధికారులు, నాయకులతో ముందస్తు చర్చలు చేసుకొని పార్టీలో చేరేందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు విశ్వాసనీయ సమాచారం. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వర్గీయులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు మెండుగానున్నాయి. సుమారు రెండు వారాలుగా రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని నిరసిస్తూ నిర్మల్ నియోజకవర్గ జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ ఆయా విభాగాల పదాధికారులు బాధ్యులు మండలాలు, పట్టణాలు, వార్డుల వారిగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తుండడానికి గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం అల్లోలకు తగిన విధంగా సలహా సూచనలు చేస్తూ పార్టీలో చేరేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని స్థానిక నాయకులతో చర్చలు జరిపినా అనంతరం చేరే కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు.

ఇప్పటికే రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గం లోని బీఆర్ఎస్ ఆయా విభాగాల పదాధికారులు నాయకులకు బీఆర్ఎస్ కు రాజీనామా విషయమై తగిన విధంగా ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం మాజీ మంత్రి అల్లోల్లను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు సుముఖతో ఉండగా స్థానిక నాయకులు మాత్రం ఆ దానిని విభేదిస్తూ సుమారు 15 రోజులుగా ఆందోళన కార్యక్రమాలను చేపడుతుండడం విదితమే. బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు మంగళవారం రాత్రి లేదా బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక సమావేశం మాజీ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ కు చెందిన పట్టణ, మండల, జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులు, ఆయా విభాగాల పదాధికారులు బాధ్యులు రాజీనామాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

అల్లోలతో పాటు రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు ముధోల్ మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ ప్రస్తుత జిల్లా అధ్యక్షులు విఠల్ రెడ్డి ఆయన అనుచర బృందం కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ముధోల్ నియోజకవర్గం లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కి రథసారథిగా ఉంటూ పార్టీ అభ్యున్నతి కోసము తనదైన రీతిలో దూసుకెళ్తున్న మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ తో పాటు ఇతర ఆయా విభాగాల కాంగ్రెస్ పార్టీ పదాధికారులు నాయకులు ప్రజా ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికను ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వ్యతిరేకించ లేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయమే తమ నిర్ణయం అంటూ వారు మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి చేరికను స్వాగతిస్తున్నట్లు సమాచారం.

అల్లోల చేరికతో నిర్మల్ జిల్లాలో బలోపేతం..

రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని ముధోల్, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీని ఆ స్థాయిలో బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేసే శక్తి సామర్ధ్యాలు రాజకీయ అనుభవం ఉన్న నాయకులు లేకపోగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేరికతో ఈ మూడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ బలోపేతమై పార్లమెంట్ ఎన్నికలలో అటు బిఆర్ఎస్, ఇటు బిజెపి కు పెద్ద దెబ్బ తగిలే అవకాశాలు కూడా లేకపోలేవు. కాంగ్రెస్ అధిష్టానం కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి నిర్మల్ జిల్లా నుంచి మూడు లక్షలకు పైగా ఓట్లు రాబట్టుకునేలా భవిష్యత్తు కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా రాజకీయ అనుభవం, ప్రభావం ఉన్న మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులను ఇతర పార్టీల నుంచి చేర్చుకునేందుకు తనదైన ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తున్నదని చెప్పక తప్పదు.

Spread the love