మహిళా ఆర్థిక సాధికారిత లక్ష్యం: మంత్రి సీతక్క

ప్రతిపక్షం, జూన్ 10: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని మూడు వేల మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళల ఆర్థిక సాధికారతను బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రుణ సదుపాయాలు కూడా అందిస్తామని మంత్రి వెల్లడించారు. మహిళలు స్వంతంగా ఉపాధి పొందడంతో పాటు కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు.

మహిళా సంఘాల ద్వారా ఉపాధి, వ్యాపార అవకాశాలను మరింత విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలు ఆర్థికంగా బలపడితే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని చెప్పారు.

స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు వివిధ రంగాల్లో విజయవంతంగా ముందుకు సాగుతున్నారని, వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీతక్క తెలిపారు. మహిళల సాధికారతతోనే సమాజం, రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని ఆమె పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News