ప్రతిపక్షం, జూలై 20: స్కైరూట్ సంస్థ విజయాన్ని దేశానికి గర్వకారణంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. కేవలం 28 ఏళ్ల యువత రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపించడం గొప్ప విజయమని ప్రశంసించారు. భారత అంతరిక్ష ప్రయాణంలో ఇది కీలక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఫలప్రదమైన చర్చలు జరగేందుకు ఎంపీలందరూ సహకరించాలని కోరారు.
ప్రస్తుతం భారత్ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, దేశం 7.7 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోందని ప్రధాని తెలిపారు.


















