Trending Now

తిరుమలకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది. మృతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మృతులను సికింద్రాబాద్ వెస్ట్ వెంకటాపురం వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో నూతన వధూవరులు బాలకిరణ్, కావ్య మృతి చెందారు.

Spread the love