ప్రతిపక్షం, ఆగస్టు 10: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ‘వారణాసి’ సినిమా నుంచి వచ్చిన అప్డేట్‌పై అభిమానుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం కేవలం కొన్ని ఫొటోలను మాత్రమే విడుదల చేయడంపై మహేశ్ అభిమానుల్లో కొంత అసంతృప్తి నెలకొంది.
మహేశ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ప్రత్యేకమైన పోస్టర్ లేదా గ్లింప్స్ వస్తుందని అభిమానులు భారీగా ఆశించారు. అయితే అప్డేట్ ఫొటోలకే పరిమితం కావడంతో కొందరు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంత భారీ ప్రాజెక్ట్‌కు రాజమౌళి తనదైన శైలిలో చిన్న గ్లింప్స్ విడుదల చేసి ఉంటే మరింత ఆసక్తి పెరిగేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే తరహాలో గతంలో హీరోయిన్ ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా కూడా ‘వారణాసి’ నుంచి ఫొటోలను మాత్రమే విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో మహేశ్ అభిమానులు ఇప్పుడు సినిమా నుంచి వీడియో రూపంలో ప్రత్యేకమైన అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు.
మహేశ్–రాజమౌళి కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా త్వరలోనే గ్లింప్స్ తరహా ప్రత్యేక అప్డేట్ విడుదల చేయాలని వారు కోరుతున్నారు. మరి మహేశ్ అభిమానుల డిమాండ్‌పై ‘వారణాసి’ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.





























