Trending Now

కృష్ణా జలాలతో కుప్పం చెరువులు నింపుతాం : ఏపీ సీఎం జగన్

ప్రతిపక్షం, ఏపీ: 2022లో కుప్పంలో పర్యటించినపుడు కృష్ణా జలాలను తీసుకొస్తానని మాటిచ్చా.. అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నా అని ఏపీ సీఎం జగన్ చెప్పారు. సోమవారం కుప్పంలోని శాంతిపురంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ పాల్గొన్నారు. కృష్ణా జలాలకు పూజలు చేసి, హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. కృష్ణా జలాలతో కుప్పం చెరువులను నింపుతామని చెప్పారు. 672 కి.మీ. దూరం నుంచి కృష్ణా నీటిని కుప్పంకు సగర్వంగా తీసుకొచ్చామన్నారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గంలో సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ కు నీటిని విడుదల చేశామని జగన్ తెలిపారు.

మూడుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏం చేశారని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. ఇన్నేళ్లలో బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తిచేయలేకపోయారని విమర్శించారు. సొంత నియోజకవర్గానికే ఉపయోగపడని చంద్రబాబు.. రాష్ట్రానికి ఎలా ఉపయోగపడతాడో ప్రజలు ఆలోచించాలని కోరారు. కుప్పంలో తాము గెలవకపోయినా మిమ్మల్ని ఏనాడూ విమర్శంచలేదని, మీరంతా నావాళ్లేనని గర్వంగా చెప్పుకున్నానని జగన్ పేర్కొన్నారు.

Spread the love