‘ఇడుపు కాయితం’ ట్రోల్స్‌పై కవిత ఫైర్.. పవన్‌ను అడగాలని వ్యాఖ్య

ప్రతిపక్షం, జూన్ 29: తెలంగాణ భాష, యాసను అవమానించేలా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌పై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఉద్యమ సమయంలో తెలంగాణను విమర్శించిన వారే ఇప్పుడు మరోసారి రాష్ట్ర సంస్కృతి, భాషపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

సినిమాకు ‘ఇడుపు కాయితం’ అనే పేరు పెట్టినా దాని అర్థం తెలియదంటూ ట్రోలింగ్ చేస్తున్న వారికి, ఆ పదం అర్థం తెలుసుకోవాలంటే పవన్‌ను అడగాలని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకపోవడంతో రాష్ట్ర భాషను అవమానిస్తున్న వారిపై స్పందించడం లేదని విమర్శించారు. అలాగే నారాయణ, చైతన్య విద్యాసంస్థలతో పాల వ్యాపారం చేస్తున్న కొందరి అంశంపై కూడా ఆమె ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

Spread the love

Related News

Latest News