Ollie Pope Creates History in test cricket: క్రికెట్ చరిత్రలో తొలి 7 టెస్ట్ సెంచరీలను 7 వేర్వేరు జట్లపై చేసిన తొలి క్రికెటర్‌గా ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ నిలిచారు. శ్రీలంకతో ఆడుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ 103 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ కెప్టెన్‌గా అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా పోప్ రికార్డు నమోదైంది. అంతకుముందు గ్రహం గూచ్ 1990లో భారత్‌పై 95 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కాగా, పోప్.. మొత్తం 49 మ్యాచ్‌లు ఆడగా..ఇప్పటివరకు 7 సెంచరీలు చేశాడు.
అయితే ఓలీ పోప్ చేసిన 7 సెంచరీలు వేర్వేరు దేశాలపై చేయడం విశేషం. భారత్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లపై సెంచరీలు నమోదు చేశాడు. దీంతో 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో దిగ్గజ క్రికెటర్లకే సాధ్యం కాని ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక్క ఆసీస్ మీద తప్పితే అన్ని జట్లపై శతకం కొట్టాడు. ఇలా చేయడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి కావడం విశేషం.