Pawan Kalyan’s Daughter Signs Faith Declaration: ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ తిరుమలకు మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లారు. అనంతరం తన ఇద్దరు కూతుర్లతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకుముందు చిన్న కుమార్తె పొలెనా అంజన తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. తన కుమార్తె క్రిస్టియన్ కావడంతో టీటీడీ రూల్స్ ప్రకారం తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పొలెనా మైనర్ కావడంతో ఆమె తరఫున తండ్రిగా పవన్ కూడా ఆయా పత్రాలపై సంతకాలు పెట్టారు. ఈ మేరకు ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పవన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. కాగా, ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 22న ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే లడ్డూ అశంపై తాను ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టలేదని, శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష అని పవన్ తెలిపారు. సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలని కోరుకుంటున్నట్లు సృష్టం చేశారు. అవుతున్నాయి.