Sitaram Yechury Health Issue: సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ఆరోగ్యం మరోసారి విషమించింది. ఈ మేరకు ఆ పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో ఆగస్టు 19న ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే, 72 ఏళ్ల ఏచూరి పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో వైద్యుల నిర్ణయం మేరకు వెంటిలేటర్ అమర్చారు. మళ్లీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు పార్టీ వెల్లడించింది. కాగా, ఏచూరి ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సీపీఎం పొలిట్ బ్యూరో ఓ ప్రకటనలో తెలిపింది.
Comrade Sitaram Yechury’s health condition pic.twitter.com/NDPl8HE8K0
— CPI (M) (@cpimspeak) September 10, 2024