తెలంగాణ ఉద్యమకారుల సమావేశం విజయవంతం చేయండి

ఉద్యమకారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి

మెదక్, ప్రతిపక్షం, జూన్ 09: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల ను గుర్తించడానికి కే. కేశవరావు ఆధ్వర్యంలో కమిటీని నియమించడం జరిగిందిని మెదక్ జిల్లా తెలంగాణ జేఏసీ సమన్వయకర్త లు.సడిమెల యాదగిరి, బి కొండల్ రెడ్డి. తెలిపారు మంగళవారం గుల్షన్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం కోసం రేపు సాయంత్రం ఐదు గంటలకు టీఎన్జీవో భవన్ మెదక్ లో సమావేశాన్ని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడంలో. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారిని,శారీరక వికలాంగులైన వారిని. కేసులు నమోదైన వారిని, జైలు నిర్బంధించబడిన వారిని,రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడానికి ఏర్పాటు చేసుకున్న ప్రాతిపదిక. కానీ తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఉద్యోగులు,ఉపాధ్యాయులు ,కార్మికులు సబ్బండ వర్గాల ప్రజలు పాల్గొని తెలంగాణ సాధించుకున్నారు. జిల్లాలో జరిగిన అన్ని కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొన్న వారందరి ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని నేడుజరిగే సమావేశంలో మెదక్ మండలం మరియు పట్టణం హవేలీ గణపురం పాపన్నపేట కొల్చారం వెల్దుర్తి మండలాలలో పనిచేసిన ఉద్యమకారులందరూ 10 తేదీ నాడు సాయంత్రం 5 గంటలకు జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో జరిగే సమావేశంలో పాల్గొనవలసిందిగా ..మెదక్ జిల్లా ఉద్యమ జేఏసీ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. మీడియా సమావేశంలో శంకర్ దయాల్ చారి, బొందుగుల నాగరాజు, పీడీ ఆనందం, భూపాల్ రెడ్డి, కుమార్ మామిడి, బొమ్మల మైసయ్య, ఆకుల పెంటయ్య, కంది శ్రీనివాస్ రెడ్డి, సత్యం మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Spread the love

Related News

Latest News