ప్రతిపక్షం, జులై 15, వనపర్తి ప్రతినిధి: కొత్తకోటలో విద్యార్థుల మౌలిక వసతుల కోసం ఏర్పాటుచేసిన పాఠశాల ప్రారంభోత్సవానికి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవర్కద్ర ఎమ్మెల్యే మా బాధలు ఆలకించండి అని మదనాపురం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు సరైన సౌకర్య లేక తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలురు పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మదనాపురం గురుకులంలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల గత 20 రోజుల క్రితం విద్యార్థి విద్యుత్ షాక్కు గురైన విషయాన్ని గురుకుల సిబ్బంది రహస్యంగా ఉంచారు. పేద విద్యార్థుల చదువుల కోసం ప్రభుత్వం అనేక పథకాలతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం గురుకులంలో సౌకర్యాలు కల్పించాలని లక్ష్యంతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది.
గురుకుల పాఠశాలలో విద్యుత్ నియంత్రణ సక్రమంగా లేకపోవడం వల్ల విద్యార్థి విద్యుత్ శాఖ గురయ్యాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో సరైన బాత్రూంలో మరుగుదొడ్లు లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు పేర్కొంటున్నారు. గురుకుల పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడం వల్ల విద్యార్థులు భైర్ భూమికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఎక్కడ ఏ విషపురుగు సంచరిస్తుందో అని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు స్థానాలు అరుబయట చేయాలిసిన పరిస్థితి నెలకొంది.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం బోధన సిబ్బందిని ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లో బోధించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మదనపురం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి పరిశీలించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. విద్యార్థుల భద్రత పర్యవేక్షణ గురుకులంలో కొరబడిందని దీంతో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మదనాపురం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను ఫోన్ ద్వారా సంప్రదించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. విద్యార్థుల భద్రత పైన సౌకర్యాల పైన జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి పరిశీలన చేయాలని, గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.
















