Andhra Pradesh: నేటి నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు

TDP Membership Drive From Today: ఏపీలో నేటి నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు రికార్డు స్థాయిలో చేపట్టేలా పార్టీ ఏర్పాట్లు చేసింది. రూ.100 చెల్లించి సభ్యత్వం తీసుకుంటే రూ.5లక్షల వరకు ప్రమాద బీమా వర్తించేాలా నిర్ణయించింది. దీంతో పాటు కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం సాయం అందించనుంది. రాష్ట్రంలో టీడీపీని మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా గ్రామగ్రామానికి పార్టీని విస్తరించనున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని స్వయంగా సీఎం ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా, తొలి జాబితాలో 21 నామినేటెడ్ పదవులకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈసారి రెట్టింపు సంఖ్యతో జాబితాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కష్టపడిన వారికే పదవి ఉంటుందని, నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కూటమి పక్షాలతోనూ చంద్రబాబు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

Related News

Latest News