[t4b-ticker]

కాలు విరిగిందని వెళ్తే హార్ట్ సర్జరీ.. చివరికి

ప్రతిపక్షం, జూలై 29: హరియాణాలోని పానిపట్‌లో వైద్య నిర్లక్ష్యం ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రమాదంలో కాలు విరగడంతో చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన గుడ్డి దేవీ అనే మహిళకు, అవసరం లేకుండానే వైద్యులు గుండె శస్త్రచికిత్స నిర్వహించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.

శస్త్రచికిత్స అనంతరం మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మరణానికి అసలు కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మరోవైపు ఈ ఆరోపణలపై సంబంధిత ఆసుపత్రి యాజమాన్యం లేదా వైద్య సిబ్బంది ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఘటనపై స్పష్టత కోసం వేచి చూడాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News