Trending Now

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. రాష్ట్ర అవసరాల మేరకు దీన్ని రూపొందించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘గత హామీ మేరకు ITIR ప్రాజెక్టును ప్రారంభిస్తాం. భద్రాచలం వద్ద APలో విలీనమైన 5గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో కలుపుతాం. సైనిక పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం. బయ్యారం ఉక్కు పరిశ్రమను నిర్మిస్తాం’ అని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం అయ్యిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే పాలన గాడిలో పెట్టామని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణకు బీజేపీ, బీఆర్ఎస్ ఏమి చేయలేదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి రాగానే పునర్విభజన చట్టంలోని అన్ని అంశాలను పూర్తి చేస్తామని తెలిపారు.

పాంచ్ న్యాయ్ (ఐదు న్యాయాలు)..

నీతి ఆయోగ్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లోపెట్టడానికి నిర్ణయించాం

IARI, ICMR, నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ, కేంద్ర వైద్య పరిశోధన సంస్థ, ఏర్పాటు చేస్తాం

మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తాం

హైదరాబాద్‌‌లో సుప్రీం కోర్టు బెంచ్‌ని ఏర్పాటు చేస్తాం

ITIR ని పునప్రారంభిస్తాం

ఆంద్ర ప్రదేశ్‌లో విలినమైన 5 గ్రామాలను తెలంగాణాలో కలుపుతాం

ప్రతి ఇంటికి సౌరశక్తి విద్యుత్ ఏర్పాటు చేస్తాం

Spread the love

Related News

Latest News