టాలీవుడ్ సీనియర్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత.. సినీ పరిశ్రమలో విషాదం

ప్రతిపక్షం, ఆగస్టు 04: టాలీవుడ్‌తో పాటు భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.

1952లో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించిన ప్రదీప్ రావత్, విలన్ పాత్రల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ చిత్రంలో భిక్షూ యాదవ్ పాత్రతో తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

తెలుగులో ఛత్రపతి, గజిని, భద్ర, దేశముదురు, యోగి, లక్ష్మీ, పంచాక్షరి తదితర చిత్రాల్లో తన విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి విశిష్టమైన నటుడిగా గుర్తింపు పొందారు. ఇటీవల తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘గాయపడ్డ సింహం’ చిత్రంలో కూడా ఆయన కనిపించారు.

ప్రదీప్ రావత్ మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.

Spread the love

Related News

Latest News