చాక్లెట్ల ఆశ చూపి బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

ప్రతిపక్షం, జూలై 15: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో 7వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రెహాన్ (28) బాలిక ఇంటి సమీపంలో పండ్లు విక్రయిస్తూ ఉండేవాడు.

బాలికను చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తానని నమ్మించి ఇంట్లోకి తీసుకెళ్లిన నిందితుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. జరిగిన విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించడంతో బాధిత బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదని వెల్లడించారు.

ఇటీవల నిందితుడు మరోసారి బాలికను వేధించేందుకు ప్రయత్నించడంతో ఆమె తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడు రెహాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Spread the love

Related News

Latest News