తెలంగాణలో వరుసగా 3 రోజుల సెలవులు.. స్కూళ్లకు గుడ్‌న్యూస్

ప్రతిపక్షం, ఆగస్టు 07: తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం సోమవారం సాధారణ సెలవు ప్రకటించింది. దీంతో రెండో శనివారం, ఆదివారం, సోమవారం కలిపి చాలా పాఠశాలలకు వరుసగా మూడు రోజుల సెలవులు లభించనున్నాయి.

అయితే ఇటీవల భారీ వర్షాల కారణంగా అదనపు సెలవులు ప్రకటించిన పాఠశాలలు మాత్రం ఆ సెలవులను భర్తీ చేసేందుకు ఈ శనివారం తరగతులు నిర్వహించనున్నట్లు సమాచారం.

మరోవైపు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఆగస్టు 10లోపు సంబంధిత డేటాను సమర్పించాల్సి ఉన్నందున వారికి ఈ సెలవులు వర్తించవని, వారు విధుల్లో కొనసాగాల్సి ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Spread the love

Related News

Latest News