పేద వృద్ధుల పాదాలకు నమస్కరించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

కోట్ల సంపద కంటే ప్రజల ఆశీర్వాదాలే ముఖ్యమంటూ వినమ్రత ప్రదర్శన

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 08 : మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు నియోజకవర్గ పర్యటనలో భాగంగా పేదలు, వృద్ధులతో ఆప్యాయంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా వృద్ధుల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలను స్వీకరించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పటికీ సామాన్య ప్రజల మధ్యకు వెళ్లి వారితో ఆప్యాయంగా మాట్లాడటం, పెద్దల పట్ల గౌరవం చూపడం తన పర్యటనలో భాగంగా కనిపించింది. ముఖ్యంగా పేద వృద్ధుల వద్దకు వెళ్లి వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవడం పలువురి దృష్టిని ఆకర్షించింది.సంపద, హోదా, పదవుల కంటే ప్రజల ప్రేమాభిమానాలు, పెద్దల ఆశీర్వాదాలే ముఖ్యమనే సందేశాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించిన తీరుగా అనుచరులు అభివర్ణిస్తున్నారు.
ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు పెద్దల పట్ల గౌరవం, పేదల పట్ల ఆప్యాయత చూపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే వృద్ధుల పాదాలకు నమస్కరిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం స్థానికంగా ఆకట్టుకుంటున్నాయి.

Related News

Latest News