Trending Now

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్లే ట్రావెల్స్ బస్సు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం వద్ద ఓవర్ స్పీడ్‌తో కారును తప్పించే క్రమంలో కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో పల్టీ కొట్టింది. ఇందులో సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 20 మందికి స్వల్ప గాయాలు, ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని అంబులెన్స్ ద్వారా నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Spread the love

Related News

Latest News