ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 28: మెదక్ జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాల చిన్నపాటి వర్షానికి కళాశాలలోకి వర్షం నీరు రావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మెదక్ జిల్లాలోని బాలికల ఏకైక కళాశాల మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్నది కళాశాల నిర్మాణమే చెరువుకుంటలో ఉండడం మూలంగా చిన్నపాటి వర్షానికి కళాశాలలోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా కళాశాల క్లాస్ రూమ్ లోకి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు . ముఖ్యంగా బాత్రూంలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది చెరువులోనే డ్రైనేజీ కట్టడంతో మీరు ఎటు వెళ్లలేక బాత్రూంలోనే ఉండడం జరుగుతుంది దీంతో విద్యార్థులు వాష్ రూమ్ వెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారని విద్యార్థినిలు తెలిపారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకొని కళాశాలలోకి నీరు రాకుండా చూడాలని విద్యార్థులు తెలిపారు.


















