హైదరాబాద్‌లో బాబు, పవన్‌ల రాజకీయాలకు రేవంత్ బలహీనతే కారణం: కవిత

ప్రతిపక్షం, జూన్ 17: తెలంగాణ రాజకీయాల్లో పొరుగు రాష్ట్రాల నాయకుల జోక్యం పెరుగుతోందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. రామగుండంలో నిర్వహించిన ‘బాయిబాట’ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల ప్రముఖ నాయకులు తరచూ హైదరాబాద్ కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ తమ పార్టీని అడ్డుకుంటున్నారని చెప్పడం సరికాదని ప్రశ్నించారు.

రాష్ట్ర నాయకత్వం బలహీనంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆమె విమర్శించారు. తెలంగాణను ప్రజల పోరాటంతో సాధించుకున్నామని, రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News