ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ జోరు కొనసాగిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన నుంచి ట్రెండ్ టీడీపీ వైపు సాగుతోంది. ప్రస్తుతం రెండు స్థానాలకు చెందిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య బయటకు వచ్చాయి. రాజమండ్రి రూరల్, నెల్లూరు సిటీలో టీడీపీ పార్టీ ముందంజలో ఉంది. నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి నారాయణ పోటీ చేశారు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరిలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్లలో వైసీపీ అభ్యర్థి మంత్రి చెల్లుబోయిన వేణుపై 910 ఓట్ల ఆధిక్యంలో బుచ్చయ్య చౌదరి ముందజలో ఉన్నారు.